Friday 24 June 2016

Saloon madhuu

టైం పదకొండు కావస్తోంది...మధు కి విసుగ్గా వుంది...ఆ రోజు మంగళ వారం కావడంతో కస్టమర్స్ పెద్దగా రారు...పొద్దున్న నుంచి కేవలం ఇద్దరు మాత్రం..అదీ షేవింగ్ కోసం వచ్చారు...ఇంకా ఈ రోజుకి సెలూన్ కట్టేసి వెళ్లి పోదాం అనుకొంటూ టీ.వీ ఆన్ చేసాడు మధు...ఏదో సీరియల్ వస్తోంది...అదీ బోరింగ్ గా నే వుంది..ఇంతలో బయట స్కూటి ఆగిన శబ్దం విని బయటకి చూసాడు మధు...బ్యాంకు లో పని చేసే విమల స్కూటి ని పార్క్ చేస్తోంది...
ఆమెని చూడంగానే గౌరవంగా లేచి..విష్ చేస్తూ బయటికి వచ్చాడు మధు..."గుడ్ మార్నింగ్ మేడం..ఏంటి ఇలా వచ్చారు ...కబురు చేస్తే నేనే వచ్చే వాడిని కదా.."వినయంగా అన్నాడు మధు...ఆమె పని చేసే బ్యాంకు లోనే లోన్ తీసుకుని సెలూన్ పెట్టుకున్నాడు అతను...
"ఏమీ లేదు మధు...సెలవు లో వున్నాను....బయటికి వెళ్లి వస్తూ నువ్వు ఖాళీగా వుండటం చూసి ఇలా వచ్చాను...ఎలా వుంది నీ బిజినెస్?"లోపలి వస్తూ అడిగింది విమల..
"మీ అందరి దయ వాళ్ళ బాగుంది మేడం..లోన్ కూడా మూడొంతులు తీర్చేసాను.."చెప్పాడు మధు.
"గుడ్.."అంది విమల సెలూన్ ని కలియ చూస్తూ....తరువాత మధు వంక చూస్తూ అడిగింది.."నాకు బాయ్ కట్ ఎలా వుంటుంది మధూ?"
మధు ఆశ్చర్య పోయాడు ఆమె అడిగింది విని...తరువాత అన్నాడు...."ఎందుకు మేడం ..అలా అడుగుతున్నారు?"
"ఏమీ లేదు...మా వారు ఎప్పుడూ నాకు బాయ్ కట్ బాగుంటుందని అంటుంటారు..కానీ నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు....కానీ ఇప్పుడు తప్పేటట్టు లేదు" అక్కడున్న సోఫాలో కూచుంటూ అంది విమల..."నా జుట్టు బాగా నేరిసిపోతోంది మధూ...ప్రతి పదిహేను రోజులకు ఒక సారి డై వేయాల్సి వస్తోంది..నాకుబాగా విసుగు పుడుతోంది...మా బ్యాంకు కి వచ్చిన కొత్త మేనేజర్ స్మితా రావు ది కూడా బాయ్ కట్టే...ఆ హెయిర్ కట్ లో ఆమె చాలా హుందాగా కనిపిస్తున్నారు..ఆమెని చూసినాక నాకు కూడా అలా చేయించుకుందామనిపిస్తోంది...మా వారి కోరిక తీర్చినట్టు వుంటుంది...నాకు హెయిర్ డై వేసుకోడం తేలిక...అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను...ఆయన లేరు క్యాంపు కి వెళ్లారు రేపు వస్తారు...ఆయన వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దామని ".....
"మీ ఫేస్ కి బాయ్ కట్ బాగా సూట్ అవుతుంది మేడం..."ఆమె వంక చూస్తూ చెప్పాడు మధు...
"మరి నాకు చేస్తావా?" అడిగింది ఆమె..."మేడం...నేనా.."ఆశ్చర్యపోతూ అడిగాడు మధు..
"అవును..ఏం చేయవా?" అంది ఆమె..."అయ్యో అలా కాదు మేడం..మీరు ఇక్కడ..."నీళ్ళు నములుతూ అడిగాడు మధు.."పోనీ మీ ఫ్లాట్ కి రమ్మంటారా " అన్నాడు
"వద్దు మధూ, నాకు ఇక్కడే..ఈ కుర్చీ లో కూచుని క్రాప్ చేయించుకోవాలని వుంది..."స్థిరంగా అంది ఆమె...
"మీ ఇష్టం మేడం...ఎటూ ఈ రోజు ఎవరూ రారు ...మీకు కావాలంటే ఇక్కడే మీకు క్రాప్ చేస్తాను..''వినయంగా చెప్పాడు మధు...
"మరి ..ఇప్పుడు చేస్తావా?" అంది విమల..
విమల వాళ్ళ బాల్కని లో నిలబడి చూస్తె మధు సెలూన్ స్పష్టంగా కనిపిస్తుంది...ఈ మధ్య విమలకి ఎందుకో బార్బర్ షాప్ లో కూచుని క్రాప్ చేయించుకోవాలనే కోరిక బాగా పెరిగింది...ఖాళీ దొరికనప్పుడల్లా ఆమె మధు తన కస్టమర్స్ కి క్రాప్ చేయడం గమనిస్తోంది...ఆమెకి కూడా అలా బార్బర్ కుర్చీ లో కూచుని జుట్టుని కట్ చేయిన్చుకోవలనిపిస్తోంది...
మధు సెలూన్ గ్లాస్ డోర్ ని మూసేసి కర్టైన్ లాగాడు...కుర్చీని ఆమె ఎత్తుకి తగ్గట్టు సరి చేసి "ప్లీజ్ రండి మేడం.."అన్నాడు మధు.
విమల లేచి వచ్చి ఆ కుర్చీ లో కూచుంది...ఆమెకి చాలా ఎగ్జైటింగ్ గా వుంది...విమల జుట్టు చాలా వత్తుగా నడుముకి కొంచెం పై దాకా వుంటుంది...
మధు ఆమె పెట్టుకున్న హెయిర్ క్లిప్ ని తీసి ఎదురుగా వున్నా స్టాండ్ మీద పెట్టాడు..దువ్వెన తీసుకుని ఆమె జుట్టుని బాగా దువ్వాడు..
మధు కి కూడా ఆ అనుభవం కొత్తగా వుంది..ఎప్పుడూ మొగ వాళ్ళ జుట్టుని కత్తిరించే అతనికి ఒక మహిళ కి బాయ్ క్రాప్ చేయడం..చాలా ఎగ్జైటింగ్ గా వుంది...
కానీ ఆమె జుట్టుని ఒకే సారి బాయ్ క్రాప్ చేయడం అతనికి నచ్చలేదు...అందుకని..
"మేడం..మీది మంచి జుట్టు...ఈ జుట్టుని ఎలా కత్తిరించినా బాగుంటుంది....అందుకని నాదొక చిన్న రిక్వెస్ట్.." అన్నాడు మధు...
"చెప్పు మధు..''అడిగింది విమల...
"ఏం లేదు మేడం....ముందు మీ జుట్టుని U షేప్ లో కత్తిరిస్తాను...తరువాత బాబ్ కట్ చేస్తాను ..చివరికి మీరు అడిగినట్టు బాయ్ క్రాప్ చేస్తాను.."ఆమె ఏమనుకుంటుందో అన్నట్టు చిన్న గొంతుతో అన్నాడు మధు..
ఆమె నవ్వి..."నీకు అలా బాగుంటుందంటే..అలాగే చెయ్యి మధూ" అంది...
మధు కి చాలా సంబరమేసింది...అతనికి జుట్టుని అలా రకరకాలుగా కత్తిరించడమంటే చాలా ఇష్టం...కానీ ఎప్పుడూ అవకాసం రాలేదు...
ఆమె జుట్టుని బాగా దువ్వినాక కత్తేరని తీసుకున్నాడు మధు....విమల ఎదురుగా వున్నా అద్దం లో అతను చేసే పనిని గమనిస్తోంది విమల..వెనక వున్నా అద్దం లో ఆమె వెనుక వైపు కూడా బాగా కనిపిస్తోంది..
మధు ఆమెకి ఎడమ వైపున నిలబడి..కత్తేరని కొద్దిగా ఏటవాలుగా వుంచి..నిదానంగా ఆమె జుట్టుని కత్తిరించడం మొదలు పెట్టాడు..
"కచాక్..కచాక్..కచాక్.." కత్తెర కొంచెం కొంచెం గా ఆమె జుట్టుని కత్తిరిస్తోంది...మధ్య మధ్య లో దువ్వెన తో ఆమె జుట్టుని దువ్వుతూ పది నిముషాల్లో ఆమె జుట్టుని చక్కని U షేప్ లో కత్తిరించాడు మధు...
"ఎలా వుంది మేడం.."ఆమె వంక చూస్తూ అడిగాడు...వెనక వైపు అద్దం కనిపిస్తున్న తన జుట్టుని చూసి "ఫెంటాస్టిక్" అంది విమల...
"మేడం..ఇప్పుడు బాబ్ కట్ చేస్తాను 'అన్నాడు మధు..తల ఊపింది ఆమె
ఆమె భుజాల పైన కత్తెర పెట్టి కత్త్తిరించడం మొదలు పెట్టాడు మధు...పెద్ద పాయలు తెగి కింద పడుతున్నాయి...చాలా ఏకాగ్రతతో కత్తేరని కదిలిస్తున్నాడు మధు...
కాసేపటికి ఆమె జుట్టు చాల వరకు నెల మీద వుంది..
"వావ్....చాలా బాగుంది మధు..."తలని అటూ ఇటూ ఊపుతూ అంది విమల...బాగా వత్తైన జుట్టు కావడంతో ఆమెకి బాబ్ కట్ చాలా బాగుంది...
"మేడం..ఇలాగే వుంచుకుంటారా...మీకు బాబ్ చాలా బాగుంది..."అన్నాడు మధు.....
ఒక్క క్షణం ఆలోచించి..."వద్దు మధు..నాకు బాయ్ క్రాపే కావాలి " అంది విమల..
"సరే మేడం" అని...మల్లె కత్తేరని చేతిలోకి తీసుకున్నాడు మధు...జుట్టుని దువ్వెన లోకి దూర్చి..అచ్చం మగ వాళ్లకి చేసినట్టుగా..కత్తిరించడం మొదలు పెట్టాడు...విమల ఆసక్తి గా అద్దం లో చూస్తోంది...పది నిముషాల్లో ఆమె జుట్టు పూర్తి గా బాయ్ క్రాప్ గా మారిపోయింది...
"చాలా బాగా చేసావు మధు...థాంక్స్.."అని అతని చేతిలో వంద రూపాయల నోట్లు రెండు పెట్టి బయటికి నడిచింది విమల...
"జుట్టు బాగా పెరిగిందే"..అద్దం లో చూసుకుంటూ అనుకుంది విమల...ఆమె మధు సెలూన్ లో క్రాప్ చేయించుకొని మూడు నెలలు దాటింది. జుట్టు పెరిగి భుజాలను తాకుతోంది..ఆమె భర్త బాబ్ లాగ పెంచుకోమంటున్నాడు..కానీ ఆమెకి బాయ్ క్రాపే నచ్చింది...మైంటైన్ చేయడం చాలా ఈజీ గా వుంది ఆమెకి...మళ్ళీ మధు సెలూన్ కి వెళ్ళాలని అనుకుంది ఆమె. అక్కడ కుర్చీ లో కూచుని క్రాప్ చేయించుకోవడం ఆమెకి చాలా నచ్చింది..క్రాప్ చేసినాక మధు స్ట్రైట్ రేజర్ తో మెడ మీద గీకడం ఆమెకి తెగ నచ్చింది...మళ్ళీ ఆ అనుభవం కావాలని వుంది ఆమెకి...కేవలం మధు సెలూన్ కి వెళ్ళడం కోసం ఆమె మంగళవారం సెలవు పెట్టింది...ఆ రోజు అయితే మధు కొంచెం ఖాళీగా ఉంటాడు..
ఆ రోజు మంగళవారం...టైం పదకొండు దాటింది..బాల్కని లో నిలబడి మధు సెలూన్ వంక చూసింది విమల...మధు ఆమె ఊహించినట్టుగానే ఖాళీగా వున్నాడు..వెంటనే కిందకి దిగి మధు సెలూన్ వైపు నడిచింది...
"గుడ్ మార్నింగ్ మేడం...రండి"...ఆమెని చూడగానే విష్ చేసి ఆమెని లోపలి ఆహ్వానించాడు మధు...ఆమె నవ్వుతూ లోపలి నడిచింది...
"జుట్టు పెరిగింది మేడం.."ఆమె తల వంక చూస్తూ అన్నాడు మధు...
"హా..అందుకే కదా నీ దగ్గరకి వచ్చాను.." అంది ఆమె అద్దంలో చూసుకుంటూ...
"బాగా పెరిగింది మేడం...ఈ సారి బాబ్ చేయమంటారా..?" కుర్చీని ఆమె వైపు తిప్పుతూ అడిగాడు మధు...
"వద్దు మధు...నాకు బాయ్ క్రాపే బాగుంది..ఈ సారి కూడా అలానే చెయ్యి.."కుర్చీలో కూచుంటూ అంది విమల...
"ఓ.కే. మేడం" అన్నాడు మధు...ఆమె భుజాల మీదుగా గుడ్డని కవర్ చేసాడు...దువ్వెన తీసుకుని ఆమె జుట్టుని బాగా దువ్వాడు...తరువాత వాటర్ స్ప్రేయర్ తీసుకుని జుట్టుని తడిపాడు...మళ్ళీ ఒక సారి దువ్వి..కత్తెర తీసుకున్నాడు....ఆమె జుట్టుని దువ్వుతూ ...అచ్చం మగవాళ్ళకి క్రాప్ చేసినట్టే ఆమె జుట్టుని కత్తిరించడం మొదలు పెట్టాడు..
"కచాక్...కచాక్..చక్..చక్..కచాక్.''...అతని చేతిలోని కత్తెర లయబద్దం గా కదులుతోంది...విమల ఎదురుగా వున్నా అద్దం లో చూస్తోంది...జుట్టు కొంచెం కొంచెం తెగి ఆమె ఒల్లో పడుతోంది...పది నిముషాల్లో ఆమె జుట్టు బాయ్ క్రాప్ గా మారిపోయింది...
"చూడని మేడం..చాలా..ఇంకొంచెం తగ్గించేదా?"...కతేరని కింద పెడుతూ అడిగాడు మధు...అతను అలా దువ్వెనతో దువ్వుతూ కతిరిస్తుంటే విమలకి చాల బాగుంది...అందుకని.."ఇంకొంచెం కత్తిరించినా బాగుంటుందా?..అని అడిగింది..
"ఆ..ఇంకో అర అంగుళం కత్తిరించినా బాగానే వుంటుంది మేడం.."అన్నాడు మధు..
"సరే...అలా అయితే తగ్గించు" చెప్పింది విమల..మధు మళ్ళీ కత్తేరని తీసుకున్నాడు...ఇంకో ఐదు నిముషాల్లో ఆమె జుట్టు బాగా తగ్గి..అచ్చం మగ పిల్లల క్రాప్ లాగ వచ్చింది...
మధు దువ్వెన, కత్తెర పక్కన పెట్టి స్ట్రైట్ రేజర్ చేతిలోకి తీసుకున్నాడు...విమల అందుకోసమే ఎదురుచూస్తోంది..మధు రేజర్ ని శుభ్రంగా తుడిచి..దానిలో కొత్త హాఫ్ బ్లేడ్ పెట్టాడు...స్ప్రేయర్ తో ఆమె మెడ మీద తడిపాడు...
"కొంచెం తల వంచండి మేడం.." ఆమె వెనకాల నిలబడి అన్నాడు మధు...విమల తలని వంచింది..
"సర్.." రేజర్ ఆమె మెడ మీద ఆనింది...అంతే!!! ఆమె వెన్నుపూస లోనించి కరెంట్ ప్రవహించినట్టు ఐంది..ఆమె ఒళ్ళు జలదరించింది....మధు మెడ మీద గీకడం ఒక్క క్షణం ఆపాడు..ఆమె శరీరం కంపించడం ఆగింది...మధు మళ్ళీ గీకడం మొదలు పెట్టాడు...
నేప్ షేవ్ ఆమెకి బాగా నచ్చింది అని అర్ధం ఐంది అతనికి ....అందుకని బాగా నిదానంగా గీకడం మొదలు పెట్టాడు...పదునైన రేజర్ ఆమె మెడ మీద కదులుతుంటే విమలకి స్వర్గం లో వున్నట్టు వుంది...మధు కావాలనే కొంచెం ఎక్కువ సేపు గీకాడు....కొంత సేపటికి ఆమె మెడ క్లీన్ గా వచేసింది...
మధు ఆమె జుట్టుని మళ్ళీ బాగా దువ్వి క్రాప్ ని సెట్ చేసి .."ఎలా వుంది మేడం?" అని అడిగాడు...
"చాలా బాగుంది మధు.." కుర్చీలోనించి లేస్తూ అంది విమల...
"నేను కూడా ఇక మీదటి నుంచి ప్రతి నెల నీ సెలూన్కి వస్తాను..ఇలాగే చేయాలి...సరేనా '' వంద రూపాయల కాగితాన్ని అతని చేతిలో పెడుతూ అంది విమల..
"ష్యూర్ మేడం..." నవ్వుతూ చెప్పాడు మధు....విమల ఆనందంగా బయటికి నడిచింది...
"గుడ్ మార్నింగ్ మేడం, ప్రసాదం తీసుకోండి"....అన్న మాటలు వినిపించి తల పైకి ఎత్తి చూసింది విమల...ఎదురుగా క్రెడిట్ ఆఫీసర్ మాలతి...చేతిలో తిరుపతి ప్రసాదంతో నిలబడి వుంది...ఆమెని చూసిన విమల ఆశ్చర్యపోయింది...మాలతి నున్నటి గుండుతో నిలబడి ఉంది...ఆమెది నడుముదాకా వుండే వత్తైన జడ..ఇప్పుడు బోడి గుండుతో తమాషాగా వుంది...
"ఏంటి సర్ప్రైజ్ ....మొక్కా..?" అడిగింది విమల ప్రసాదం తీసుకుంటూ..
"అలా ఏమీ లేదు మేడం...మా వారికి మొక్కు...ఆయన గుండు చేయిన్చుకొంటుంటే ..నాకు కూడా అలా చేయిన్చుకోవాలనిపించింది...ఆయనని అడిగితే...చేయిన్చుకోమన్నారు..సమ్మర్ వస్తోంది కదా...హాయిగా ఉంటుందని చేయించుకొన్నాను "...చెప్పింది మాలతి...
విమల నవ్వి "బాగుంది మీ డెసిషన్ " అంది...మాలతి కూడా నవ్వి తన సీట్ దగ్గరకి వెళ్లిపోయింది ..
విమలకి మాలతి గుండు బాగా నచ్చింది...ఏంటో ఆమె గుండుతో ఇంకా అందంగా వున్నట్టు అనిపించింది విమలకి...ఇంటికి వెళ్ళినాక కూడా ఆమెకి మాలతి గుండు కళ్ళల్లో మెదులుతోంది...
మరుసటి ఆది వారం విమల భర్త కూడా సెలూన్ కి వెళ్లి నున్నగా గుండు చేయించుకొని వచ్చాడు...ఎండాకాలం హాయిగా ఉంటుందని చేయించుకున్నాను అని చెప్పాడు ఆయన కూడా విమలతో...
రాను రానూ విమలకి కూడా చక్కగా గుండు చేయిన్చుకొందామనే కోరిక కలగసాగింది...ఆమె క్రాప్ చేయించుకొని దాదాపు నాలుగు నెలలు దాటింది...జుట్టు పెరిగి భుజాల మీద పడుతోంది...
తన ఆలోచనని భర్తతో చెప్పింది విమల...ఆయన ఏమీ అభ్యంతరం చెప్పలేదు..."నీ ఇష్టం.నీకు ఎలా బాగుంటే అలా చేయించుకో" అన్నాడు..
వెంటనే మంగళవారం సెలవు పెట్టేసింది విమల...మరి ఆ రోజే కదా మధు కాస్త ఫ్రీ గా వుండేది...
మంగళవారం....టైం పది దాటింది...విమల భర్త తన ఆఫీస్ కి వెళ్ళిపోయాడు..విమల బాల్కని లో నిలబడి మధు సెలూన్ వంక చూసింది...ఎవరూ లేరు..మధు ఒక్కడే కూచుని
T .V . చూస్తున్నాడు...విమల వెంటనే ఆపార్ట్మెంట్ లోనించి బయటికి వచ్చి మధు సెలూన్ వైపు నడిచింది....
"గుడ్ మార్నింగ్ మేడం...రండి.." విమల ని చూడగానే సాదరంగా ఆహ్వానించాడు మధు...
విమల లోపలి వచ్చింది...
"చాలా రోజులు ఐంది మేడం మీరు నా దగ్గరికి వచ్చి...మళ్ళీ బాయ్ క్రాప్ చేయమంటారా?" వినయంగా అడిగాడు మధు..
"కాదు మధు ....ఈ సారి క్లీన్ షేవ్" చెప్పింది విమల కుర్చీలో కూచుంటూ...
మధు ఆశ్చర్యంగా "ఏంటి మేడం!" అన్నాడు...
"ఔను మధు...నువ్వు విన్న్డది నిజమే..నేను ఈ సారి నున్నగా గుండు చేయించుకుందామని డిసైడ్ అయ్యాను.." స్థిరంగా చెప్పింది విమల....
ఆమె మాటలు విన్న మధు గుండె లయ తప్పింది...అతనికి ఆడవాళ్ళకి గుండు చేయాలనే కోరిక చాలా రోజుల నుంచి వుంది..కానీ ఎప్పుడూ ఆ అవకాసం రాలేదు...
''ఏంటి మధూ..ఆలోచిస్తున్నావు...నాకు గుండు బాగుండదా?" అంది విమల మధు ఏమీ మాట్లాడకపోయేసరికి ..
"అదేమీ లేదు మేడం...మీది గుండ్రని మొహం కదా..మీకు గుండు అయినా చాలా బాగుంటుంది..." చెప్పాడు మధు...
"మరి ...నాకు గుండు చేస్తావా?.." నవ్వుతూ అడిగింది విమల....మధు కూడా నవ్వుతూ తల ఊపాడు.
వెంటనే తెల్లని కేప్ తీసి ఆమె భుజాల చుట్టూ కప్పాడు..విమల ఎదురుగా వున్నా అద్దంలో చూస్తూ కూచుంది...మధు వాటర్ స్ప్రేయర్ తీసుకుని ఆమె తల మీద నీళ్ళు చిలకరించాడు...తరువాత తన చేతి వేళ్ళతో ఆమె జుట్టుని తడపడం మొదలు పెట్టాడు మధు...
అతను అలా వేళ్ళతో జుట్టుని రుద్దుతుంటే విమల కి చాలా హాయిగా వుంది...ఓ మూడు నిముషాలు అలా రుద్ది రేజర్ ని చేతిలోకి తీసుకున్నాడు మధు..
"ఇంకొంచెం సేపు అలా రుద్దు మధూ" అంది విమల
మధు ఇంకోసారి ఆమె జుట్టుని తడిపి మళ్ళీ రుద్దటం మొదలుపెట్టాడు...ఈ మధ్య వెంట వెంటనే కత్తిరించడటం తో విమల జుట్టు బాగా వత్తుగా పెరిగింది..ఆమె వత్తైన జుట్టుని రుద్దుతుంటే మధు కి కూడా బాగుంది...అలా అతను దాదాపు పది నిముషాలు ఆమె జుట్టుని నీళ్ళతో మర్దన చేసాడు...
రేజర్ తీసుకుని దాన్లో కొత్త హాఫ్ బ్లేడ్ పెట్టాడు...
"మధూ...తిరుపతి లో లాగా స్పీడ్ గా గీకమాక..నిదానంగా గీకు సరేనా.." మధు వంక చూస్తూ చెప్పింది విమల...
"మేడం...వాలుకి గీకమంటారా...లేక ఎదురు గీకమంటారా?' అడిగాడు మధు ఆమె పక్కన నిలబడి..
"అంటే..??" అర్ధం కానట్టు అడిగింది విమల.....
'ఎం లేదు మేడం...మధ్యలో మొదలు పెట్టి నుదురు వైపు గీకితే వాలు...అలా కాకుండా..నుదురు దగ్గర మొదలు పెట్టి పైకి గీకితే ఎదురు.."చెప్పాడు మధు...
"ఎలా బాగుంటుంది..." అంది విమల....
"మీరు నిదానంగా గీకమంతున్నారు కదా...ఎదురు బాగుంటుంది." అన్నాడు మధు...విమల సరే అన్నట్టు తల ఊపింది..
మధు రేజర్ కత్తి తీసుకుని విమల వెనకకి వచ్చాడు...ఆమె తలని కుర్చీకి ఆనించి పట్టుకుని నుదురు పైన కత్తి పెట్టాడు...విమల అద్దం లో ఆసక్తిగా చూస్తోంది...
'సర్....సర్...."మధు చేతిలోని కత్తి విమల నుదురు దగ్గరి నుంచి పైకి కదల సాగింది...మధు చాలా నిదానంగా కత్తిని కదిలిస్తున్నాడు...పట్టుకుచ్చు లాంటి విమల జుట్టు కొంచెం కొంచెం తెగి ఆమె ఒడిలో పడుతోంది...పదునైన కత్తి అలా తల మీద కదులుతుంటే విమలకి చాలా హాయిగా వుంది...జుట్టు బాగా నాని ఉండటంతో మెత్తగా తెగుతోంది..
ఓ సారి గీస్తే జస్ట్ ఓ అరా అంగుళం కన్నా తక్కువగా తెగుతోంది...విమల చాలా బాగా ఆస్వాదిస్తోంది...కాసేపటికి ఆమె తల పై భాగం నున్నగా వచ్చేసింది...ఇప్పుడు ఆమె చెంపల మీద...మెడ మీద మాత్రమే జుట్టు వుంది...మధు గీకడం ఆపాడు...
విమల ఇప్పుడు చూడటానికి తమాషాగా వుంది....
"కానీ మధు...గీకు"...ఆలస్యం భరించలేనట్టు అంది విమల...
మధు మళ్ళీ మొదలు పెట్టాడు....ఇప్పుడు ఆమె తలని ముందుకు వంచి ఆమె మెడ పైన గీకుతున్నాడు మధు...
"అబ్బా మధు ...చాలా బాగుంది..స్వర్గంలో వున్నట్టు వుంది..." విమల చిన్నగా అంది...ఆమె అలా అంటుంటే మధు కి కూడా అదోలా వుంది....అతను ఇంకా ఉత్సాహంగా గీకుతున్నాడు ....ఇప్పుడు రెండు పక్కల మాత్రమె జుట్టు వుంది...పైన, వెనక బోడి ఐపోయింది....
మధు ఎడమ పక్క గీకడం మొదలుపెట్టాడు...చెవి దగ్గర గీకుతుంటే విమలకి గిలిగింతలు పెట్టినట్టు ఉంది...
''మధూ...ఇంకా నిదానంగా గీకు..." విమల గొంతు మత్తుగా వుంది...
మధు ఆమె తలని తన ఎడమ చేతితో పట్టుకుని నిదానంగా గీకుతున్నాడు...
మొదటి సారి ఓ స్త్రీ కి గుండు గీకుతున్నాడు అతను...అతనికి మబ్బుల్లో తెలుతున్నట్టు ఉంది.....
కాసేపటికి విమల పూర్తిగా గుండు ఐపోయింది...
"అప్పుడే అయిపోయిందా??' నిరాశగా అంది విమల....
"ఉండండి మేడం..." అని మధు ఆమె గుండు ని మళ్ళీ నీళ్ళతో తడిపి దాని మీద షేవింగ్ కరీం రాసాడు..గుండు మొత్తం కరీం రాసి మళ్ళీ గీకడం మొదలుపెట్టాడు....విమలకి ఆ అనుభవం కొత్తగా వుంది...ఆమె ఏమీ మాట్లాడకుండా ఆస్వాదిస్తోంది...
ఓ పావు గంట అలా బాగా గీయించుకుని ఇంటికి వెళ్ళింది విమల....

No comments:

Post a Comment